ఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించిన డ్రోన్

ఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించిన డ్రోన్

జీ20 సమ్మిట్ వేళ ఢిల్లీలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. సెంట్రల్ ఢిల్లీలోని పటేల్ నగర్ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతున్నట్లు కంట్రోల్ రూమ్ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, అక్కడ పుట్టినరోజు పార్టీ జరుగుతోందని.. వేడుకను చిత్రీకరించడానికి ఒక ఫోటోగ్రాఫర్ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని అధికారి తెలిపారు.  ఐపీసీ సెక్షన్ 188   కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జీ 20 సమ్మిట్  భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 12 వరకు ఢిల్లీలో పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌ల వంటి  వైమానిక ప్లాట్‌ఫారమ్‌లను ఎగురవేయడాన్ని నిషేధించారు.

ALSO READ :మొరాకోలో తీవ్ర భూకంపం.. 632కు పెరిగిన మృతుల సంఖ్య

రెండు రోజుల G20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు నగరానికి రావడంతో దేశ రాజధాని, ప్రత్యేకించి న్యూఢిల్లీ జిల్లా భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ పోలీసులకు 50,000 మంది భద్రతా సిబ్బంది, K9 డాగ్ స్క్వాడ్‌లు, మౌంటెడ్ పోలీసులు మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) సహాయం అందిస్తున్నారు.