హైదరాబాద్లో ‘గే’ యాప్లో డ్రగ్స్ అమ్ముతున్నారు.. కొనేటోళ్లంతా వాళ్లే..!

హైదరాబాద్లో ‘గే’ యాప్లో డ్రగ్స్ అమ్ముతున్నారు.. కొనేటోళ్లంతా వాళ్లే..!

హైద్రాబాద్: హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. డ్రగ్స్ తీసుకుంటూ పలువురు పట్టుబడ్డారు. ఒక ‘గే’ యాప్లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు పెడ్లర్లు, ఏడుగురు కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం.. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియాకు కొన్ని కీలక వివరాలను వెల్లడించారు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నామని, 100 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏడుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నామని, నిందితులంతా.. ఒక ‘గే’ డేటింగ్ యాప్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిపారు.

డ్రగ్స్ కొంటున్న వాళ్లంతా హోమో సెక్సువల్కి అలవాటు పడ్డవాళ్ళని పోలీసులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. కొన్ని సింబల్స్ను వాడుకుని డ్రగ్స్ కొనుగోలు చేయడం చేస్తున్నారని చెప్పారు. రాకెట్, పావురం, విమానం వంటి సింబల్స్ వాడుతున్నారని తెలిపారు. ఒక గ్రాము డ్రగ్ను నిందితులు 10 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఏడుగురు కస్టమర్లలో ఐదుగురికి పెళ్ళిళ్ళు అయి.. విడాకులు అయ్యాయని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు డాక్టర్ కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్ కేసుపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించిన వివరాలు:
* గ్రిండర్ అనే యాప్ ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తుంది ఈ గ్యాంగ్
* ఈ గ్రిండర్ యాప్లో హోమోసెక్సువల్ యాక్టివిటీస్ జరుగుతాయి
* ఒక పేరెంట్ తన అబ్బాయి ప్రవర్తన మీద అనుమానం వచ్చి మా దృష్టికి తీసుకొచ్చాడు
* ఆ పేరెంట్ ఇచ్చిన సమాచారంతో ఈ యాప్ ద్వారా డ్రగ్ సప్లై జరుగుతున్నట్లు గుర్తించాము
* ఈ కేసులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ఏడుగురు కస్టమర్లను గుర్తించాము.. వీరిలో ఇద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ 
* నైజీరియకు చెందిన ఒక వ్యక్తి వీరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు
* నైజీరియన్ను కూడా పట్టుకున్నాము.. అతనిని నైజీరియాకు డిపోర్ట్ చేసే ప్రక్రియ చేస్తున్నాము