డ్రంకెన్‌ డ్రైవ్‌ కు మరణశిక్షే

డ్రంకెన్‌ డ్రైవ్‌ కు మరణశిక్షే

తప్పతాగి రోడ్డు మీదు రయ్ రయ్ అని దూసుకెళ్లే వారి గుండె గుభేలుమనే వార్త. ఎందుకంటే ఇకనుంచి డ్రంకెన్ డ్రైవ్ కు మరణశిక్షే. అయితే ఇండియాలో కాదు. తైవాన్లో. ఈ మేరకు ఆ దేశప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. తాగివాహనం నడిపి మనుషుల ప్రాణాలు తీసే వారికి మరణ దండన విధిస్తూ క్రిమినల్ కోడ్ సవరణ ముసాయిదాకు అక్కడి కేబినెట్ ఆమోదం తెలిపింది. తాగి వాహనాన్ని నడిపి జైలుకెళ్లొచ్చిన వారు ఐదేళ్లలో మళ్లీ అదే నేరం చేస్తే శిక్షా కాలం పెరుగుతుంది.యాక్సిడెంట్లో వ్యక్తులు తీవ్రంగా గాయపడితే12 ఏళ్ల శిక్ష విధించనున్నారు. ఈ ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. తైవాన్లో తాగినడిపి ప్రాణాలు తీస్తే ప్రస్తుతం పదేళ్ల వరకు శిక్ష విధిస్తున్నారు. తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీస్తున్న సంఘటనలు తైవాన్లో పెరిగిపోతున్నాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తైవాన్ సర్కారు చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ఓ వ్యక్తితప్పతాగి వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. మరో ముగ్గురి కి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రపంచంలో చాలా దేశాల్లో ..
ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌ కు మరణశిక్ష విధిస్తున్నాయి. చైనాలో గతంలో తాగి వాహనాలు నడిపి మనుషుల్నిబలిగొనే వారికి మరణశిక్ష విధించేవారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా శిక్షలు అమల్లో ఉన్నాయి. 2014లో టెక్సస్‌‌‌‌‌‌‌‌లో ఓవ్యక్తి తాగి వాహనం నడిపి నలుగురి ప్రాణాలు తీసినందుకు మరణశిక్ష విధించారు. తర్వాతజీవిత ఖైదుగా మార్చారు. 2005లో మరణశిక్ష అమలును నిలి పేసిన తైవాన్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 2010లో మళ్లీ మొదలుపెట్టింది. అంతర్జాతీయ, మానవ హక్కుల సంఘాలు విమర్శించినా వెనక్కి తగ్గలేదు. గత సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో తన మాజీ భార్యను, కూతురును చంపిన వ్యక్తికి మరణశిక్ష విధించింది. క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ పనిష్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ప్రజలుమద్దతిస్తున్నారని సర్వేలూ వెల్లడించాయి.