పెళ్లి పీటలపై తాగి పడిపోయాడు.. తర్వాత ఏం జరిగింది?

పెళ్లి పీటలపై తాగి పడిపోయాడు.. తర్వాత ఏం జరిగింది?

శుభమా అని పెళ్లి జరుగుతుంది.. అందరూ వచ్చారు.. సందడిగా ఉంది.. వధువు ఇంట్లో జరుగుతున్న పెళ్లికి వరుడు కుటుంబం తరలి వచ్చింది. రాచ మర్యాలతో స్వాగతం పలకటానికి వెయిట్ చేస్తున్న వధువు తరపు బంధువులు షాక్ అయ్యారు.. పెళ్లి కొడుకు ఫుల్ గా మందు కొట్టి.. కారులో నుంచి దిగలేక తూలుతున్నాడు. పెళ్లి కొడుకు తండ్రిది కూడా అదే సిట్యువేషన్. .ఎలాగోల పెళ్లికొడుకును మండపంలోని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారు.. అయితే మత్తులో ఉన్న వరుడు.. పీటలపై కూర్చోలేక.. అక్కడే పడుకుండిపోయాడు. ఎంతలేపినా లేవటం లేదు.. నీళ్లు కొట్టినా ఉపయోగం లేదు.. తాగిన మత్తులో తన పెళ్లి అన్న విషయమే మర్చిపోయాడు. పెళ్లి అవుతుందన్న ఆనందంలో పీకల దాకా తాగి.. ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నాడు ఈ వరుడు..

ఈ ఘటన ఒడిశా రాష్ట్రం నల్బరీ జిల్లాలో జరిగింది. పెళ్లి కొడుకు పేరు ప్రసేన్ జిత్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. మత్తు దిగిన తర్వాత పెళ్లి చేద్దాం అని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించినా.. పెళ్లి కుమార్తె మాత్రం నిరాకరించింది. పెళ్లి చేసుకోను అని తేల్చిచెప్పింది. పెళ్లి చేసుకోవాల్సిన వాడే.. తాళి కట్టాల్సినోడే.. పెళ్లి పీటలపై పడిపోయాడు అంటే.. అతని బాధ్యత ఏంటో అందరూ చూశారు.. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోను అంటూ అడ్డం తిరిగింది. దీనిపై పోలీసులకు కూడా కంప్లయింట్ చేసింది. పెళ్లికి అయిన ఖర్చులను పెళ్లి కుమారుడి నుంచి ఇప్పించాలని పంచాయితీ పెట్టింది. పోలీసులు సైతం.. రెండు కుటుంబాల పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పెళ్లి పీటలపై తాగి పడిపోయిన మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు అంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం పెళ్లి ఆనందంలో మరీ ఎక్కువగా తాగేశాడు అంటున్నారు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం కచ్చితంగా నాశనం అయ్యేదని మరికొందరు.. అమ్మాయి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. పెళ్లి పీటలపై తాగి పడిపోయిన వీడియో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది.