సాయం చేయడానికొచ్చిన పోలీసులనే ఐడీ కార్డు అడిగిన వ్యక్తి

సాయం చేయడానికొచ్చిన పోలీసులనే ఐడీ కార్డు అడిగిన వ్యక్తి

జగిత్యాలలో  రాత్రి 11.30 గంటలకు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ లకు వింత అనుభవం ఎదురైంది. కొత్త బస్టాండ్ సమీపంలో నటరాజ్ టాకీస్ వద్ద బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కిందపడిపోయాడు. దాంతో కానిస్టేబుళ్లు పరిగెత్తుకొని వెళ్లి అతన్ని పైకి లేపారు. ఎక్కడి నుండి వస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి మీరెవరు??? అంటూ పోలీసులను  ఎదురు ప్రశ్నించాడు. తాము డ్యూటీలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులమని కానిస్టేబుళ్లు సమాధానమిచ్చారు. దాంతో ఆ వ్యక్తి.. మీరు పోలీసులు అయితే దానికి రుజువు ఏంటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. బిత్తరపోయిన పోలీసులు.. అక్కడే  పెట్రోలింగ్ వెహికిల్ లో ఉన్న ఎస్ఐ నవతకి విషయం చెప్పారు. దాంతో ఆ వ్యక్తి కోరిన విధంగానే ఐడీ కార్డులని చూపించండంటూ కానిస్టేబుళ్లకి ఎస్సై నవత చెప్పారు. అంతేకాకుండా పనిలో పనిగా అతనికి బ్రీత్ ఎనలైజర్ కూడా  చేయండి అంటూ ఆదేశించారు. ఆ వ్యక్తికి ఐడీ కార్డులు చూపించి.. అనంతరం బ్రీత్ ఎనలైజర్ చేశారు. ఆ వ్యక్తి ఊదగానే ఏకంగా 160 వరకు రీడింగ్ వచ్చింది. దాంతో పోలీసులు అతని వివరాలు తీసుకొని బండిని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.

For More News..

ఆందోళనకారులను అరెస్ట్ చేయండంటూ ఎమ్మెల్యే హుకూం

తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు

కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్