ఆదివారం వస్తే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్ దర్శనమిస్తాయి

ఆదివారం వస్తే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్ దర్శనమిస్తాయి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం ప్రైమరీ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్, మందు బాటిల్స్ దర్శనం ఇస్తాయి. స్కూల్స్ కు హాలిడేస్ వచ్చినపుడల్లా తాగుబోతులకు అడ్డాగా మారుతుందని, మద్యం మత్తులో బాత్ రూమ్ డోర్స్,కిటికీలు పగలగొడుతున్నారని, బీర్ బాటిల్స్ పగల కొట్టడంతో కాళ్ళకి కుచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. 

ఎన్ని సార్లు పోలీసులకు, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరుతున్నారు స్టూడెంట్స్,టీచర్లు. పిల్లలు చదువుకునే ప్రదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు గ్రామస్థులు కూడా అధికారులను కోరుతున్నారు.