అణగారిన వర్గాలకు రాజకీయాధికారం దక్కాల్సిందే

అణగారిన వర్గాలకు రాజకీయాధికారం దక్కాల్సిందే
  • అణగారిన వర్గాలకు రాజకీయాధికారం దక్కాల్సిందే
  • డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్​ మహరాజ్​

జనగామ అర్బన్​, వెలుగు : అణగారిన వర్గాలకు రాజకీయాధికారం దక్కితేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​విశారదన్​ మహరాజ్​అన్నారు. బుధవారం జనగామలోని ఉషోదయ కన్వెన్షన్​లో ఏర్పాటు చేసిన దళిత్​శక్తి ప్రోగ్రాం13వ రాష్ట్ర ప్లీనరీకి పెద్దసంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల రాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

ఇప్పటివరకు 19 జిల్లాల్లో పూర్తి చేసుకున్నామని, జనగామ జిల్లాలో గురువారం నుంచి మొదలు పెట్టనున్నామన్నారు. 10 శాతం లేని రెడ్డి, వెలమలు 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను పాలించడం అప్రజాస్వామికమని విశారదన్​మహారాజ్​ అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల తరపున ఒక రాజకీయ వేదిక అవసరమని, అది డీఎస్​పీ తరపున రావాల్సిందేనని చెప్పారు. దుర్గాప్రసాద్​, సుమన్​, హరీశ్​ గౌడ్​, రహమాన్​, గణేశ్, రమేశ్, కృష్ణ నాయక్​, అశోక్​ యాదవ్​, రాఘవేంద్ర, మురళి, లక్ష్మణ్​, శ్రీనివాస్​, గాలయ్య, శేఖర్​ పాల్గొన్నారు