ఇక బేకరీలో ఉద్యోగానికి అప్లయ్ చేసుకుంటా : 20 ఏళ్ల సీనియర్ డాక్టర్ ఇలా ఎందుకన్నారు..?

ఇక బేకరీలో ఉద్యోగానికి అప్లయ్ చేసుకుంటా : 20 ఏళ్ల సీనియర్ డాక్టర్ ఇలా ఎందుకన్నారు..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)..కృత్రిమ మేథస్సు..ఇటీవల కాలంలో ఎంతలా అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాం..AI అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. ఐటీ, మెడికల్, ఫార్మా ఇలా అన్ని రంగాల్లో అంచనాలకు మించి ఫలితాలను అందిస్తోంది. AI తో ఎన్ని లాభాలున్నాయో వాటితోపాటు నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. వృత్తి, ఉద్యోగ, ఉపాధి కోల్పోతామని చెబుతున్నారు.  సోషల్ మీడియాలో ఓ డాక్టర్ ఇటీవల షేర్ చేసిన పోస్ట్ ఒకటి దీనికి ఉదాహరణ.. నేను నా ఉద్యోగాన్ని కోల్పోతున్నాను. బేకరీలో ఉద్యోగానికి అప్లయ్ చేసుకుంటా అంటూ ఆ డాక్టర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నెట్టింట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పెద్ద చర్చ సాగుతోంది..అదేంటో చూద్దాం.. 

దుబాయ్ కి చెందిన  డాక్టర్ మొహమ్మద్ ఫౌజీ కట్రంజీ అనే ఓ పల్మోనాలజిస్ట్ (ఊపిరితిత్తుల చికిత్స నిపుణులు).. AI డయాగ్నస్టిక్ పరికరం ఛాతి ఎక్స్ రేలో న్యుమోనియా సంకేతాలను ఖచ్చితంగా, వేగంగా గుర్తించడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతోపాటు ఆందోళన కూడా చెందాడు. శ్వాసకోశ చికిత్సలో 20 యేళ్ల అనుభవం.. AI మోడల్ సామర్థ్యం ముందు వెలవెలబోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అనుభవం ఉన్న డాక్టర్ గా తాను గుర్తించిన దానికంటే AI అందించిన ఫలితాలు కలవరపెట్టేవిగా ఉన్నాయని అంగీకరించారు. 

ఆ వీడియాలో డాక్టర్ కట్రంజీ ఎక్స్ రే ను పరిశీలించి ఓ చోట న్యుమోనియా ఉన్నట్లు గుర్తించారు. అదే ఎక్స్ రే ను AI మోడల్ తో డయాగ్నిస్టిక్ చేయించారు. అది డాక్టర్ గుర్తించిన ప్రాంతానే కాకుండా మరోచోట కూడా న్యుమోనియా భాగాన్ని ఖచ్చితత్వంతో గుర్తించింది. దీంతో డాక్టర్ షాక్ అయ్యారు. 

ఇదిగో AI వచ్చింది.. సెకనులలో డయాగ్నసిస్ చేస్తుంది.. ఎక్స్ రేలను పరిశీంచేందుకు మా లాంటి ఫ్రొఫెషనల్స్ అవసరం తీరిందనుకుండా..ఇక మేం మెక్ డొనాల్స్డ్ లాంటి బేకరీల్లో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాల్సి వస్తుందని హాస్యంగా స్పందించారు. 

డాక్టర్ కట్రంజీ వీడియో సోషల్ మీడియాలో అనేక స్పందనలను రేకెత్తించింది. AI పనితీరుపై నెటిజన్లు రెండుగా చీలి పోస్ట్ లు చేశారు. కొందరు డాక్టర్ కట్రంజీ భయాన్ని హైలైట్ చేస్తే.. చాలామంది AIఅభివృద్ధి డాక్టర్లను రీప్లేస్ చేయడం కాదు.. వారి పని వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. 

AI వల్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు లేదు.. సమయాన్ని ఆదాచేయడం, తక్కువ టైంలో ఎక్కువమందికి వైద్యం చేయొచ్చని డాక్టర్ కట్రంజీకి సలహా ఇచ్చారు. 

ఆరోగ్య సంరక్షణలో ముఖ్యంగా డయాగ్నస్టిక్ రేడియాలజీలో AI వాడకం ఇటీవలి సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందింది. లూనిట్ ఇన్‌సైట్ CXR వంటి పరికరాలు ఇప్పుడు అనుభవజ్ఞులైన వైద్యులతో సమానంగా పనిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వారి కంటే మెరుగైన రోగనిర్ధారణ ఖచ్చితత్వాన్ని చూపిస్తున్నాయి. ఈ వ్యవస్థలు ఎక్స్ రేలను సెకన్లలోనే స్కాన్ చేసి అర్థం చేసుకోగలవు.  రోగనిర్ధారణ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేశాయి. 

డాక్టర్ కట్రంజీ అనుభవం వైద్యంలో AI సామర్థ్యాన్ని నొక్కిచెపుతుంది. ఉద్యోగ భద్రత, AI-ఆధారిత భవిష్యత్తులో వృత్తిపరమైన నైపుణ్యం మారుతున్న స్వభావం గురించి పెరుగుతున్న ఆందోళనలను కూడా హైలైట్ చేసింది.

ఈ ఆందోళనలు ఈ యేడాది (2025) ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కామెంట్స్ ను నిజం చేస్తున్నాయి.  ఫిబ్రవరిలో ది టునైట్ షో స్టార్రింగ్ జిమ్మీ ఫాలన్‌లో పాల్గొన్న బిల్ గేట్స్.. కృత్రిమ మేధస్సులో పురోగతి త్వరలో డాక్టర్లకు పనిలేకుండా చేస్తుందని చెప్పారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూసి ఆశ్చర్యం, అసంతృప్తి రెండూ వ్యక్తం చేశారు.

 AI రాబోయే రోజుల్లో నిపుణుల స్థాయి సేవలను - ఆరోగ్య సంరక్షణతో సహా - ఉచితంగా అందించగదని అన్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వైద్య సంరక్షణకు విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని చెప్పుకొచ్చారు.