
పంజాబ్ కింగ్స్ టీమ్ వివాదంలో చిక్కుకుంది. బోర్డు సభ్యుల మధ్య అంతర్గతంగా ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా తయారయ్యింది. చాలా రోజులుగా బోర్డు మెంబర్ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం ఒక్కసారిగా బయట పడింది. టీమ్ ఓనర్లలో ఒకరైన ప్రీతిజింటా కోర్టు మెట్లు ఎక్కడం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ హీరోయిన్, పంజాజ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా తన కో డైరెక్టర్లపై ఛండీగఢ్ కోర్టులో కేసు వేసింది. దీనికి కారణం.. ప్రీతి లేకుండానే బోర్డు సభ్యులు జనరల్ మీటింగ్ ఏర్పాటు చేసి.. నిర్ణయాలు తీసుకోవడం. ఏప్రిల్ 21న కోడైరెక్టర్లైన మోహిత్ బర్మన్, నెస్ వాడియా ఆధ్వర్యంలో సమావేశం (EGM) ఏర్పాటు చేయడం వివాదాస్పంగా మారింది. కేపీహెచ్ డ్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్ కు నెస్ వాడియా, బర్మన్ ఓనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే కంపెనీ ఐపీఎల్ టీమ్ అయిన పంజాబ్ కింగ్స్ టీమ్ కు ఓనర్ కావడం గమనార్హం.
అయితే కంపనీల చట్టం-2013 .. చట్టానికి విరుద్ధంగా బోర్డు సభ్యులు ఏప్రిల్ 21న మీటింగ్ ఏర్పాటు చేశారని కేసులో పేర్కొంది ప్రీతి. ఈ మీటింగ్ కు సంబంధించి ఏప్రిల్ 10న ప్రీతిజింటా వ్యతిరేకించినా.. ఆమె అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రీతిజింట ఆందోళన :
బోర్డు మీటింగ్ లో మునీష్ ఖన్నాను డైరెక్టర్ గా అపాయింట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రీతిజింటా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మీటింగ్ నిర్ణయాలను చెల్లవని, రద్దు చేయాల్సింగా కోర్టును కోరింది. అయితే ఈ మీటింగ్ కు ప్రీతిజింటా తో పాటు మరో డైరెక్టర్ కరణ్ పాల్ కూడా హాజరవ్వడం గమనార్హం.
Also Read : మెగా ఫ్యామిలీ వివాదంలో భైరవం మూవీ డైరెక్టర్
మునీష్ ఖన్నా డైరెక్టర్ పదవిని రద్దు చేయాలని.. అదే విధంగా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కొట్టి వేయాల్సిందిగా ఆమో కోర్టును కోరింది. భవిష్యత్తులో ఆమెతో పాటు కరణ్ లేకుండా మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలసి అభ్యర్థించింది. ఈ అంశం పూర్తిగా తేలే వరకు మునీష్ ఖన్నాను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాల్సిందిగా పిటిషన్ లో కోరింది. అయితే ప్రీతి కోర్టుకు వెళ్లడంపై మిగతా డైరెక్టర్లు నెస్ వాడియా, మోహిత్ బర్మన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ టీమ్ 2025 ఐపీఎల్ సీజన్ లో దూసుకుపోతోంది. 12 మ్యాచ్ లు ఆడిన ఈ టీమ్.. 17 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. 2014 తర్వాత ప్లేఆఫ్స్ కు చేరువ కావడం ఇదే తొలిసారి. దీంతో టీమ్ పర్ఫామెన్స్ పై ప్రీతి చాలా ఎగ్జైట్మెంటతో ఉంది. అయితే లేటెస్ట్ గా డైరెక్టర్ల మధ్య వివాదం ముదిరటంతో.. ఈ ప్రభావం టీమ్ పై ఏమైనా పడుతుందా అనే కోణంలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.