సేలం : నార్త్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ భారీ స్కోరు చేసింది. రికీ భుయ్ (103 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. 324/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌ను 172.5 ఓవర్లలో 630/8 డిక్లేర్ చేసింది. రికీతో పాటు కృష్ణప్ప గౌతమ్ (48), రవితేజ (42) రాణించారు. నార్త్ బౌలర్లలో మయాంక్ డాగర్ 3, నిషాంత్ సింధు, పుల్కిట్ నారంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో 19 రన్స్ చేసింది. యష్ ధుల్(8 బ్యాటింగ్), మన్నన్ వోహ్రా (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
కోయంబత్తూర్‌లో జరుగుతున్న మరో సెమీస్‌లో వెస్ట్‌జోన్ 257 రన్స్‌కు ఆలౌటైంది. తర్వాత సెంట్రల్ జోన్ 128 రన్స్‌కే కుప్పకూలింది. కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్. జైదేవ్, తనుష్ కొటియాన్ చెరో మూడు వికెట్లతో సెంట్రల్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. తర్వాత ఆట మొదలుపెట్టిన వెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 130/3 స్కోరు చేసింది. పృథ్వీ షా (104 బ్యాటింగ్), అర్మాన్ జాఫర్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ సందర్భంగా పేసర్ చింతన్ గాజా (వెస్ట్‌జోన్) విసిరిన బౌన్సర్.. వెంకటేశ్ అయ్యర్ (సెంట్రల్ జోన్) మెడకు బలంగా తాకింది. ముందు జాగ్రత్తగా అంబులెన్స్‌ను మైదానంలోకి తీసుకొచ్చి చికిత్స అందించారు.
