NBK 109 ఇంట్రెస్టింగ్ టాక్..బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో!

NBK 109 ఇంట్రెస్టింగ్ టాక్..బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో!

మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్   నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. వాటిని బేస్ చేసుకొనే ఆయనతో సినిమాలు ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఈ మధ్య బాలయ్య నుండి వచ్చిన అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు మాస్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని తీసినవే. 

ఇక లేటెస్ట్గా బాలయ్య నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రొడక్షన్ టీమ్ తోనే మేకర్స్ ఈ సినిమాపై బుజ్ క్రియేట్ చేశారు. 

అంతేకాకుండా..ఈ ప్రాజెక్టులో మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అదేంటంటే..ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మన తెలుగు వాళ్లకి సీతారాముడిగా..ఎంతో సుపరిచుతులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(DulquarSalman)ను రంగంలోకి దింపుతున్నట్లు టాక్.

ఈ యంగ్ హీరో బాలయ్యకు పోటీగా దిగుతాడా..లేదా బాలయ్య కు తోడుగా ఉంటాడా..అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య మూవీలో చిరుకి..తోడుగా మాస్ రాజా రవితేజ ని దింపిన విషయం తెలిసిందే. దీంతో NBK109 లో దుల్కర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి మరి.