దుండిగల్, వెలుగు: మద్యం మత్తులో సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళను హత్య చేసిన వ్యక్తిని 48 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు.మద్యం మత్తులో సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళను హత్య చేసిన వ్యక్తిని 48 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను దుండిగల్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కోటి రెడ్డి సోమవారం వెల్లడించారు. దుండిగల్ తండా-2కు చెందిన జె.శాంతి(45) కిరాణ దుకాణం పెట్టుకొని ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇంటి పక్కనే నెల రోజుల కిందట హన్మకొండ జిల్లా సుబేదారికి చెందిన రావుల కమల్ కుమార్ (37) అద్దెకు దిగాడు.
అల్ట్రా క్లినిక్ సర్వీసెస్ కంపెనీలో అతడు సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఈ నెల 21న తన మొబైల్ చార్జర్ పోయిందని, నీవే తీసావంటూ శాంతితో గొడవ పడ్డాడు. ఈ నెల 23 అర్ధరాత్రి కూడా మళ్లీ ఆమెతో గొడవకు దిగి మద్యం మత్తులో కిందకు తోసేశాడు. ఆమె కేకలు వేయడంతో నోరు, ముక్కు మూసి హత్య చేసి తన స్వగ్రామానికి పరారయ్యాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
Dundigal Tanda mobile charger incident