
కరీంనగర్, వెలుగు: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవి(సిద్ధిదాత్రి) అవతారంలో, రత్నాల అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం గణేశ్ నగర్ శివాలయ ప్రధాన అర్చకులు పురాణం మహేశ్వర శర్మ రూపొందించిన రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్ ను బండి సంజయ్ ఆవిష్కరించారు.
విజయ దశమి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా కరీంనగర్‌లో పురాణ పండితులు వేణుగోపాలశర్మ, గణేశ్ నగర్ శివాలయ ప్రధాన అర్చకులు పురాణం మహేశ్వర శర్మ మౌన వ్రతం చేపట్టడం, వారి నివాసాలకు వెళ్లి కేంద్ర మంత్రి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం వారి వద్దకు వెళ్లిన బండి సంజయ్ పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
కోరుట్ల, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కథలాపూర్మండలం సిరికొండ గ్రామం మున్నూరు కాపు సంఘం సభ్యులు, బీజేపీ లీడర్లు మంగళవారం కరీంనగర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిరికొండ మున్నూరు కాపు ఫంక్షన్ హోల్‌లో అదనపు షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, సంజయ్ సానుకూలంగా స్పందించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మారుతి, బద్రి సత్యం, ప్రతాప్, అనిల్, వెంకటేశ్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు చుక్క మురళి, సభ్యులు ఉన్నారు.