Nani 33: దసరా డైరెక్టర్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన నాని

Nani 33: దసరా డైరెక్టర్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన నాని

నేచురల్ స్టార్ నాని (Nani)తో దసరా (Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు.అప్పటినుండి ఈ దర్శకుడు తన రెండో  సినిమాను ఏ స్టార్ తో చేయనున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే తాజాగా తన సెకండ్ ఫిల్మ్ అనౌన్స్ చేశాడు.తన రెండో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో స్టైలిష్ లుక్, కోరా మీసాలతో నాని కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుండంగా..ఊర మాస్ లెవల్లో బీడీ తాగుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు..అనే ట్యాగ్ తో సినిమా ఏ విధంగా ఉండనుందో అనే అంచనాలు షురూ చేశారు శ్రీకాంత్.

ఈ మూవీ నాని కెరియర్ లో 33వ సినిమాగా రాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో తొమ్మిదవ సినిమాగా  తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

అయితే,ఇన్నాళ్లు  డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దసరా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ తో ఆ రూమర్స్ కి బ్రేక్ పడింది. మొత్తానికి ఈ సినిమా కొత్త కథతో వస్తున్నట్లు పోస్టర్ తో క్లారిటీ వచ్చింది.

ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya)తో సరిపోదా శనివారం(Saripoda Sanivaram) అనే సినిమా చేస్తున్నాఅదే ఊపులో మరో సినిమాను మొదలుపెట్టేశాడు నాని. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న దర్శకుడు సుజీత్(Sujeeth) తో తన 32వ సినిమాను మొదలుపెట్టేశాడు.

గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా సంబందించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.