ఇన్‌స్టాగ్రాంలో ఒక్క పోస్టుకు రూ. 7.5కోట్లు

ఇన్‌స్టాగ్రాంలో ఒక్క పోస్టుకు రూ. 7.5కోట్లు

అమెరికన్-కెనడియన్ నటుడు, జుమాంజీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి హిట్ చిత్రాలలో నటించిన డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా నిలిచాడు. సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం.. ఈ 48 ఏళ్ల హాలీవుడ్ నటుడు అడ్వర్టైజ్ మెంట్ల కోసం చేసే ఇన్‌స్టాగ్రాం పోస్టు ఒక్కోటి దాదాపు 1,015,000 (7కోట్ల 58 లక్షల 2 వేల 788 రూపాయలు) డాలర్లు వసూలు చేయగలదు.

హాప్పర్ హెచ్‌క్యూ 2017 నుంచి అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా అత్యధికంగా సంపాదించే నటుల జాబితాను విడుదల చేయడం ప్రారంభించింది. వారు ఒక పోస్టుకు ఎంత సంపాదిస్తారో అంచనా వేస్తూ.. వారి సంపాదనను లెక్కించడం మొదలుపెట్టింది.

హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం.. జాన్సన్‌కు ఇన్‌స్టాగ్రాంలో 189 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత కైలీ జెన్నర్ కు 183 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. జెన్నర్ ప్రస్తుతం ఒక పోస్టుకు 986,000 డాలర్లు సంపాదిస్తూ రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ప్రో సాకర్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో.. ఒక పోస్టుకు సుమారు 889,000 డాలర్లు వసూలు చేస్తూ మూడో స్థానంలో ఉన్నాడు. జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియాన్ 858,000 డాలర్లు సంపాదిస్తూ నాలుగో స్థానంలో.. అమెరికన్ గాయని అరియానా గ్రాండే 853,000 డాలర్లు వసూలు చేస్తూ ఐదు స్థానంలో ఉంది. డ్వేన్ జాన్సన్ కు ఈ సంవత్సరం ఎంతో లాభదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఫోర్బ్స్ 2019 జాబితా ప్రకారం.. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా డ్వేన్ నిలిచాడు.

For More News..

గల్వాన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా

గాలి ద్వారా కరోనావైరస్.. ఆధారాలున్నాయంటున్న సైంటిస్టులు

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ