
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ. 178 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్– క్వార్టర్లో కంపెనీకి రూ. 183 కోట్ల నికర నష్టం వచ్చింది. మొత్తం ఆదాయం రూ. 673 కోట్లకు పెరిగిందని, గత ఏడాది ఇదే కాలంలో రూ. 368 కోట్లుగా ఉందని ఏథర్ ఎనర్జీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
మొదటి క్వార్టర్లో మొత్తం ఖర్చులు రూ. 851 కోట్లకు పెరిగాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ. 551 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 12.81 శాతం పెరిగి రూ. 391.80 వద్ద ముగిశాయి.