
హైదరాబాద్, వెలుగు: మల్లా రెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ‘ఈ–-వార్డ్స్ - డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. హాస్పిటల్‌లోని అన్ని వార్డు బెడ్‌లకు డోజీ అత్యాధునిక ఏఐ- పవర్డ్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దీనివల్ల రోగులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. రోగి హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, రక్తపోటు, ఎస్పీఓ2 స్థాయిలు, ఉష్ణోగ్రత, ఈసీజీ వంటివి రిమోట్‌గా పర్యవేక్షించవచ్చు. కాంటాక్ట్‌లెస్ వైటల్స్ మానిటరింగ్ కోసం డోజీ ఏఐ -ఆధారిత బల్లిస్టోకార్డియోగ్రఫీని ఉపయోగిస్తుంది.