సంక్రాంతికి ఈగల్ టపాసులు

సంక్రాంతికి ఈగల్ టపాసులు

హీరో రవితేజ నుంచి రాబోతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. ఇటీవల టీజర్‌‌‌‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ దీపావళి సందర్భంగా కాన్సెప్ట్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘ఈసారి టపాసులు సంక్రాంతికి కూడా పేలుద్దాం’ అంటూ పోస్టర్‌‌‌‌తో దీపావళి విషెస్‌‌ చెప్పాడు రవితేజ. ఇందులో తన లుక్‌‌ డిపరెంట్‌‌గా, ఇంటరెస్టింగ్‌‌గా ఉంది. 

‘ఈగల్’ అనే టైటిల్‌‌ను జస్టిఫికేషన్ ఇచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.  కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.