ఈగల్ సెకెండ్ సాంగ్‌‌‌‌ లిరికల్ వీడియో రిలీజ్

ఈగల్ సెకెండ్ సాంగ్‌‌‌‌ లిరికల్ వీడియో రిలీజ్

రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’.  కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌‌‌‌. బుధవారం ఈ మూవీ సెకెండ్ సాంగ్‌‌‌‌ లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. ‘గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే.. గల్లంతే గల్లంతే నీ కళ్లే గల్లంతే చేసెనే.. తడబడే అలజడే..’ అనే పల్లవితో మొదలైన ఈ మెలోడీ సాంగ్‌‌‌‌ను దావ్‌‌‌‌జాంద్ కంపోజ్ చేయగా.. కపిల్ కపిలన్, లిన్ పాడారు.

 ‘కాపు కాసే మాయగాడే.. మానమే గానీ మాటే లేదే.. కానరాడే పోనెపోడే వీడెవ్వడే’ అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఫారిన్ లొకేషన్లలో రవితేజ, కావ్య థాపర్ జంటపై చిత్రీకరించారు. సాంగ్‌‌‌‌ లాంచ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో రవితేజ మాట్లాడుతూ ‘ఈగల్ డిఫరెంట్ మ్యాసీ ఫిలిం. ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌ అద్భుతంగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది’ అన్నారు. ‘ఈ పాట చాలా ప్రత్యేకం. 

రవితేజ గారితో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా’ అని కావ్య థాపర్ చెప్పింది. ‘రవితేజ గారి ఫ్యాన్‌‌‌‌ అయిన నేను ఆయన సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం కల నేరవేరినట్టుగా ఉంది’ అని సంగీత దర్శకుడు దేవ్ జాంద్ అన్నాడు.  దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.