శ్రీలంక ఆస్పత్రికి భారత్ సాయం

శ్రీలంక ఆస్పత్రికి భారత్ సాయం

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మందులు దొరకట్లేదు. దీంతో ఆస్పత్రుల్లో డాక్టర్లు ఆపరేషన్లు చేయట్లేదు. మంగళవారం పరదేనియాలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీలంకలో పర్యటిస్తున్న మన విదేశాంగ మంత్రి జైశంకర్​కు ఈ విషయం తెలిసింది. దీంతో సాయం చేయాలని మన ఎంబసీ అధికారులను ఆదేశించారు. ఇండియన్ హై కమిషనర్ గోపాల్ బాగ్లేకు మంత్రి ఫోన్​ చేసి చెప్పారు. ఈ నెల 27న శ్రీలంక చేరుకున్న జై శంకర్.. ఆ దేశ ప్రధాని మహీంద్ర రాజపక్సే, ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సతో చర్చలు జరిపారు. మంగళవారం కొలంబోలో జరిగిన 18వ బిమ్స్ టెక్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.