ఈవీఎంలు వద్దు..బ్యాలెట్ పేపర్లు ముద్దంటున్న కేఏ పాల్

ఈవీఎంలు వద్దు..బ్యాలెట్ పేపర్లు ముద్దంటున్న కేఏ పాల్

మునుగోడు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. తనకు 800కుపైగా ఓట్లు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మునుగోడుకు వెళ్లి యువకులను కలిసిన పాల్..యువత తన వెంటే ఉన్నా ఓట్లు ఎందుకు పోలవ్వలేదని ప్రశ్నించారు.  మునుగోడులోని138,139 బూతుల్లో అన్ని వర్గాల ప్రజలు తనకు ఓట్లు వేసినాఎందుకు పోలవ్వలేదని ప్రశ్నించారు. 

ఈవీఎంలు మార్చేసి బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఎందుకు ఓట్లు పడలేదదనే విషయంపై మునుగోడులోని గ్రామాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. మునుగోడు ఎలక్షన్ రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.