ఉత్తరాఖండ్లో మళ్లీ కంపించిన భూమి

ఉత్తరాఖండ్లో మళ్లీ కంపించిన భూమి

ఉత్తరాఖండ్లో మరోసారి భూమి కంపించింది. ఉత్తరకాశీ జిల్లాలో ఉదయం 5.03గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయింది. ప్రకంపనల తీవ్రత స్వల్పంగా ఉన్నందన ప్రజలు దాన్ని గుర్తించలేదు. తూర్పు ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 29 కిలోమీటర్ల లోపల ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఉత్తరాఖండ్లో గత వారం రోజులగా వరుస భూకంపాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 5న 3.6 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ నెల 10న జమ్మూకాశ్మీర్ సహా ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరాఖండ్ లో 5.7తీవ్రతతో భూకంపం వచ్చింది.

For more news..

ఢిల్లీ కోట బద్దలు కొడ్త

స్కూళ్లు మూణ్నెళ్లే ఉన్నా..జాయిన్ చేస్తున్నరు