ఢిల్లీలో భూకంపం.. ఊగిన భవనాలు

ఢిల్లీలో భూకంపం.. ఊగిన భవనాలు

భారత దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలులో భూకంప తీవ్రత 6 (ఆరు)గా నమోదైంది. 2024, జనవరి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. భూకంప కేంద్రం.. భూమికి 192 కిలోమీటర్లలోపల జరిగినట్లు వెల్లడించారు అధికారులు. భూకంప తీవ్రత జమ్మూకాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు ఉంది. 

భూకంప తీవ్రతకు జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. అదే విధంగా ఢిల్లీలోని చాలా భవనాలు ఊగాయి. ఇళ్లల్లోని ఫ్యాన్లు ఊగుతున్న విజువల్స్ పోస్టు చేస్తు్న్నారు నెటిజన్లు. భూకంప తీవ్రత 6 గా ఉండటంతో.. ప్రకంపనల తీవ్రతకు ఇళ్లు, ఆఫీసుల్లోని ప్రజలు భయటకు పరుగులు తీశారు. ఇప్పటికే వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా వెల్లడి కాలేదు.