విమాన ప్రయాణం కంటే ..కిరాణా స్టోర్లకు వెళ్లే వారికే కరోనా ప్రమాదం ఎక్కువ

విమాన ప్రయాణం కంటే  ..కిరాణా స్టోర్లకు వెళ్లే వారికే కరోనా ప్రమాదం ఎక్కువ

విమానాల్లో ప్రయాణించే వారికన్నా రెస్టారెంట్లలో తినడం,కిరణాస్టోర్లకు వెళ్లేవారికే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు తెలిపారు. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు  “ఏవియేషన్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్” రిసెర్చ్ లో  ప్రచురించారు. నివారణ చర్యలు చేపట్టడం వల్ల వైరస్ తగ్గుతుందని పేర్కొన్నారు.

ఇక వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తరుచుగా చేతుల్ని శుభ్రం చేసుకోవడం, మాస్క్ లు ధరించడంతో పాటు విమానాశ్రయాలు, విమానాల్లో వెంటిలేషన్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రయాణాలకు ముందే విమానాల్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని సూచించారు.  ఈ మహమ్మారి సమయంలో కిరాణా స్టోర్లకు వెళ్లడం, రెస్టారెంట్లలో తినడం వల్ల కరోనా  ట్రాన్స్మిషన్ అవుతందని హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  సైంటిస్ట్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు.