ఈ ఊతప్పం తింటే కరోనా వైరస్ రాదట

ఈ ఊతప్పం తింటే కరోనా వైరస్ రాదట

కరోనా.. చైనా దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తున్న వైరస్ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,300 మందికి ఆ దేశంలో కరోనా వైరస్ సోకింది. 19 దేశాలకు  ఆ వైరస్ విస్తరించడంతో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)  ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.

అయితే ‘ఊతప్పం’ తినడం వల్ల కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని తమిళనాడులోని కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని చెబుతున్నాడు. నువ్వుల నూనె, చిన్న ఉల్లిపాయాలతో చేసిన ఊతప్పం.. కరోనా వైరస్‌ను నిరోధించడంలో సహాయపడుతుందని అంటున్నాడు. “సిద్ధ ఔషధం విధానం ప్రకారం, చిన్న ఉల్లిపాయలు ఫ్లూ ఆధారిత వ్యాధులను అడ్డుకుంటాయి.కాబట్టి, మేము మా హోటల్ కు వచ్చే కస్టమర్లకు చిన్న ఉల్లిపాయలతో కూడిన ఊతప్పాన్ని అందిస్తున్నాము” అని తెలిపాడు. దీనిపై ఓ ప్రకటన ఇస్తూ తన హోటల్ ముందు బోర్డ్ కూడా పెట్టాడు.