ఈసీ కీలక నిర్ణయం... ఇక నుంచి 24 గంటల ముందే చెప్పాలి..

ఈసీ కీలక నిర్ణయం... ఇక నుంచి 24 గంటల ముందే చెప్పాలి..

నాయకులకు ఎన్నికల సంఘం రోజుకో షాక్ ఇస్తుంది. ఎన్నికల ప్రచారానికి నేతలు వినియోగించే విమానాలు, హెలికాప్టర్ల వివరాలు, వాటి మూలం, గమ్యస్థానం, వాటిలో ప్రయాణించిన వ్యక్తుల వివరాలతో సహా రాజకీయ పార్టీలు తమకు అందజేయాలని భారత ఎన్నికల సంఘం కోరింది. వివరాల్లోకి వెళ్తే  ఏప్రిల్ 12న మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి తేజస్ సామెల్ తెలిపిన వివరాల ప్రకారం..

 రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వినియోగించే విమానాలు హెలికాప్టర్ల వివరాలు వాటిని ఉపయోగించే 24 గంటల ముందే ఎన్నికల అధికారికి పంపాలని సూచించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుందని, దానిని ఈసీకి పంపాలని తెలిపారు. 48 స్థానాలున్న మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి మే 20 మధ్య ఐదు దశల్లో జరగనున్నాయి.