హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఎలక్షన్ కోడ్

హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఎలక్షన్ కోడ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది ఈసీ. 12 స్థానిక సంస్థలకు కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైందన్నారు రాష్ట్ర చీఫ్​ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో ఒక్కొక్క సీటు.. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుందన్నారు. నవంబర్ 16న నోటిఫికేషన్ వస్తుందని.. 23 వరకు నామినేషన్ల స్వీకరిస్తామని చెప్పారు. డిసెంబర్ 10న పోలింగ్ 14న కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందన్నారు శశాంక్ గోయల్. రాష్ట్రంలో పాదయాత్రలకు, సభలకు అనుమతి లేదని ఆయన ప్రకటించారు. ఏమైనా సభలు, సమావేశాలు, ధర్నాలు చేయాలనుకుంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలని పార్టీలకు సూచించారు. సభలు, సమావేశాలు, ధర్నాల విషయంలో కొవిడ్ గైడ్‌లైన్స్‌ తప్పనిసరిగా పాటించాలని గోయల్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ట్రాన్స్‌జెండర్

ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌‌ఎస్ ధర్నాలు

హైదరాబాద్‌ మెట్రో రైల్ టైమింగ్స్ పొడిగింపు