హైదరాబాద్,వెలుగు: హెల్త్‌టెక్ సేవలు అందించే హైదరాబాద్ సంస్థ ఈక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ గల్ఫ్ క్యాపిటల్ నుంచి మేనేజ్‌మెంట్ బై ఔట్ (ఎంబీఓ) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ లావాదేవీతో సంస్థ పూర్తి యాజమాన్య హక్కులు తిరిగి వ్యవస్థాపకులు, మేనేజ్‌మెంట్ చేతుల్లోకి వచ్చాయి.
గల్ఫ్ క్యాపిటల్‌తో ఐదేళ్ల భాగస్వామ్యంలో ఈక్లాట్ ఆదాయం, ఎబిటా పది రెట్లు వృద్ధి చెందాయి. ఏఐ ఆధారిత 'ఎవైర్' ప్లాట్‌ఫారమ్ సహాయంతో సంస్థ తన సేవలను విస్తరించింది. అమెరికా, ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 450 నుంచి 4 వేలకు పైగా పెరిగింది. ఈక్లాట్ సంస్థ హెల్త్‌కేర్ రంగంలో రెవెన్యూ సైకిల్ మేనేజ్‌మెంట్, రిస్క్ అడ్జస్ట్‌మెంట్, హెల్త్‌కేర్ టెక్నాలజీ భాగస్వామిగా సేవలు అందిస్తోంది.
