
కాగజ్ నగర్ వెలుగు: వినాయక చవితిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణనాథులు కొలువుదీరారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కాగా పలు చోట్ల ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.
కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య యూత్ గణేశ్ మండలి వారు వెంకటేశ్వర స్వామి అవతారంలో, ద్వారకానగర్‌లోని యువజన గణేశ్ మండలి నిర్వాహకులు 3 వేల లడ్డూలతో, కాపువాడలోని శ్రీసాయి గణేశ్ మండలి ఆధ్వర్యంలో 7 వేల కాబూలీ శెనగలతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అదే కాలనీ లోని శ్రీఆదిత్య గణేశ్ మండపంలో ఆవాలు, జీలకర్ర, నువ్వులతో కూడిన విగ్రహాన్ని, గొల్లవాడ లోని యూత్ ఆధ్వర్యంలో 1600 అక్వేరియం స్టోన్స్‌తో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.