పైన షవర్.. కింద కరిగిన మట్టి గణపతి.. నిర్మల్ జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ నిమజ్జనం

పైన షవర్.. కింద కరిగిన మట్టి గణపతి.. నిర్మల్ జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ నిమజ్జనం

నిర్మల్, వెలుగు: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్మల్ క్లబ్ సభ్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడమే కాకుండా వినూత్న రీతిలో నిమజ్జనం చేసి ప్రశంశలందుకున్నా రు. నిర్మల్ ​క్లబ్​ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసిన సభ్యులు నవరాత్రులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శనివారం నిమజ్జనం సందర్భంగా వినాయకుడిని ఉంచిన ట్రాక్టర్​లోనే నిమజ్జనం చేశారు. పైన షవర్ ఏర్పాటు చేసి కింద విగ్రహాన్ని కరిగించారు.

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో క్లబ్ వద్దకు తరలివచ్చారు. కాగా ఇక్కడి వినాయకుడి లడ్డూను ప్రముఖ కాంట్రాక్టర్ సాగర్ రావు రూ.13,500 వేలపాడి దక్కించుకున్నారు. క్లబ్ జనరల్ సెక్రెటరీ ఎర్రవోతు రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, క్లబ్ సీనియర్ సభ్యులు, అడ్వకేట్లు అంజుకుమార్ రెడ్డి, కుండే రాజు, చంద్రశేఖర్ రెడ్డి, అప్పాల చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ జి.ఈశ్వర్, ఎ.రాజేందర్, ఎంబడి నరేశ్, పి.బాపు, జీవన్ గౌడ్, ఎ.కిషన్, వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.