భారత కస్టమర్లకు అమెజాన్ షాక్.. ఆర్డర్లపై అదనపు ఛార్జీ ఫిక్స్.. వెంటనే అమలులోకి

భారత కస్టమర్లకు అమెజాన్ షాక్.. ఆర్డర్లపై అదనపు ఛార్జీ ఫిక్స్.. వెంటనే అమలులోకి

Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ మాదిరిగానే తాను కూడా ప్రతి ఆర్డరుపై అదనపు ఛార్జీలను తీసుకొచ్చింది. ఫ్లాట్ ఫారం ఫీజు మాదిరిగానే కస్టమర్ల ఆర్డర్లపై ఇక నుంచి మార్కెట్ ప్లేస్ ఫీజు పేరుతో దానిని వసూలు చేస్తున్నట్లు పేర్కొంది.

అమెరిజా ప్రకటించిన మార్కెట్ ప్లేస్ ఫీలు వెంటనే అమలులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ రుసుము పూర్తిగా పన్నులతో సహా కలిపి ఒక్కో ఆర్డరుపై రూ.5 చొప్పున వసూలు చేయబడుతుందని స్పష్టం చేసింది. ఫ్లాట్ రేటున వసూలు చేసే ఈ ఫీజు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు చేసే ఆర్డర్లపై కూడా వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఈ మెుత్తాన్ని కంపెనీ అమెజాన్ ఆటంకాలు లేని సేవలను అందించటానికి అంతరాలు లేని సెల్లింగ్ ఫాట్ ఫారం కొనసాగింపుకు అవసరమని కంపెనీ వెల్లడించింది. 

వాస్తవానికి ఇలాంటి రుసుములు అంతర్జాతీయంగా కంపెనీలు తమ కస్టమర్ల నుంచి వసూలు చేస్తూనే ఉంటాయి. తాజాగా అమెజాన్ దానిని భారత మార్కెట్లలో కూడా అమలుకు తీసుకొచ్చింది. ఈ మెుత్తాన్ని పెరుగుతున్న సెల్లర్ ఎకోసిస్టమ్, లాజిస్టిక్స్ ఇన్ ఫ్రా వంటి వాటిని మెరుగుపరిచేందుకు వినియోగించాలని చూస్తోంది. కస్టమర్లు తమ బిల్లింగ్ సమయంలో చివరిగా పేమెంట్ చేసే ముందు ప్రత్యేకంగా దీనిని వసూలు చేస్తున్నట్లు చూపించబడుతుందని కంపెనీ వెల్లడించింది. 

మార్కెట్ ఫ్లేస్ ఫీజు వేటికి వర్తించదంటే..

* కస్టమర్లు కొనుగోలు చేసే గిఫ్ట్ కార్డులపై ఈ రుసుము వర్తించదు
* అమెజాన్ బిజినెస్, బాజార్, అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ కొనుగోళ్లకు రుసుము వర్తించదు
* వినియోగదారులు చేసే రీఛార్జ్ లు, బిల్ పేమెంట్స్, టిక్కెట్ బుక్కింగ్స్, సబ్ స్క్రిప్షన్ చెల్లింపులకు వర్తించదు

ఎలాంటప్పుడు మార్కెట్ ఫ్లేస్ ఫీజు రిఫండ్ వస్తుంది..

* ఆర్డర్ షిప్పింగ్ కి ముందే పూర్తిగా క్యాన్సిల్ చేసినప్పుడు- ఫుల్ రిఫండ్
* షిప్పింగ్ ముందే ఆర్డర్లో కొంత భాగం క్యాన్సిల్ చేస్తే- ఆర్డర్ విలువ ఆధారంగా రిఫండ్ వర్తింపు
* ఇంటి వద్ద ఆర్డర్ పూర్తిగా డెలివరీ తీసుకోకుండా రిజెక్ట్ చేస్తే- ఫుల్ రిఫండ్
* ఇంటి వద్ద ఆర్డర్ తీసుకునేటప్పుడు కొంత రిటర్న్ చేస్తే- రిఫండ్ ఆర్డర్ విలువ ఆధారంగా
* డెలివరీ తీసుకున్న తర్వాత ఆర్డర్ రిటర్న్ చేస్తే- రుసుములో ఎలాంటి రిఫండ్ లభించదు