టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ విచారణ వేగవంతం

టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ విచారణ వేగవంతం
  • టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ విచారణ వేగవంతం
  • పేపర్ లీకేజీలో ఈడీ దూకుడు..
  • ఈడీ విచారణకు అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ,సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ  

టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్​ కేసులో దర్యాప్తును ED మరింత వేగవంతం చేసింది. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్​ కేసులో ఏప్రిల్ 13వ తేదీన అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ,సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా సత్యనారాయణ ఉన్నారు. పేపర్స్ లీకేజీ విషయం ఎలా తెలిసింది..? ముందుగా సమాచారం ఎవరు ఇచ్చారన్న వివరాలను ఈడీ అధికారులు సేకరించనున్నారు. సత్యనారాయణ స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేయనున్నారు. సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీతో పాటు కస్టోడీయన్స్ చైర్మన్ ను ప్రశ్నించనున్నారు. 

మరోవైపు..  ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, నెట్‌‌వర్క్‌‌ అడ్మిన్‌‌ రాజశేఖర్ రెడ్డిల ఈడీ విచారణపై నాంపల్లి కోర్టులో ఏప్రిల్13వ తేదీన విచారణ జరగనుంది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు ED అధికారులు కోర్టుకు తెలిపారు. సెక్షన్ 50 ప్రకారం ఇద్దరి వాంగ్మూలం రికార్డ్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 

జైలర్​ కావాలనుకొని..గ్రూప్​1 పేపర్ ​చోరీ

టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్​ కేసులో కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్‌‌ వేసుకోవాలనే కోరికతోనే ప్రధాన నిందితుడు ప్రవీణ్‌‌ గ్రూప్‌‌1 పేపర్ ను దొంగిలించాడని సిట్​ దర్యాప్తులో తేలింది. తండ్రి అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేయడంతో తాను కూడా ఖాకీ యూనిఫామ్ ను వేసుకోవాలని ప్రవీణ్‌‌ కోరుకున్నాడని వెల్లడైంది. గ్రూప్‌‌1 పరీక్ష రాసి డీఎస్పీ లేదా జైలర్ అయ్యేందుకే క్వశ్చన్​ పేపర్‌‌‌‌  చోరీకి ప్లాన్ చేశానని దర్యాప్తులో  ప్రవీణ్‌‌ అంగీరించాడు.