
డ్రగ్స్ కేసులో రికార్డులు ఇవ్వాలని ఆదేశించినా ఖాతరు చేయడం లేదంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో రికార్డులు ఇవ్వాలని ఆదేశించినా ఖాతరు చేయడం లేదంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసు దాఖలు చేసింది. సిట్ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్, డీఆర్‌ఐ, సీబీఐ, ఎన్‌సీబీలపై కూడా ఈడీ తరఫున లాయర్ జి.ప్రవీణ్‌కుమార్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో డిజిటల్ సాక్ష్యాలు, పూర్తి రికార్డులు ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించింది.