
మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలతో పాటు మరో ముగ్గురిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఐదు రోజుల కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, రాహుల్ తోన్సే, పార్టీ నిర్వాహకుడు వీరెన్ ఖన్నా మరియు బీకే. రవిశంకర్ లను ఈడీ కస్టడీకి కోరింది. వారు మాదకద్రవ్యాలను ఉపయోగించడమే కాకుండా.. డ్రగ్ పెడ్లర్ల ద్వారా వివిధ పార్టీలకు కూడా సరఫరా చేస్తున్నారని ఈడీ ఆరోపించింది.
మనీలాండరింగ్ కు సంబంధించిన నివేదికను ఎన్‌డిపిఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) స్పెషల్ కోర్టుకు ఈడి సమర్పించింది. భారీ మొత్తంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ తన ప్రాథమిక విచారణలో వెల్లడించింది. మనీలాండరింగ్ వల్ల వచ్చిన ఆదాయాలను వెంటనే జప్తు చేయకపోతే చట్టం తన విలువను కోల్పోతుంది అని ఈడీ తన నివేదికలో తెలిపింది.
‘దోపిడీ, చంపడం, మాదకద్రవ్యాల వ్యవహారం మొదలైన వాటి ద్వారా నిందితులు కూడబెట్టిన ఆస్తులను వెలికి తీయడానికి నిందితుడి నుండి రాతపూర్వక ప్రకటనలను రికార్డ్ చేయడం చాలా అవసరం. వాటి ద్వారా నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు మరియు పెట్టుబడులు తెలుసుకోవచ్చు’ అని ఈడీ తెలిపింది.
ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా డ్రగ్ పెడ్లర్ ఒస్సీని అరెస్టు చేసినట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒస్సీ ఇప్పటికే అరెస్టయిన మరో డ్రగ్ పెడ్లర్ సైమన్ కు సహచరుడని తేలింది. ఒస్సీ నుంచి కొన్ని సింథటిక్ మందులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. వారని విచారిస్తే మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశముంది.
For More News..