మధుకాన్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

మధుకాన్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ వే కేసులో మొత్తం 96.21 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కాగా మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. 

ఇక దీనిపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేయడంపై ఈడీ చెప్పిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు.