ఈడీ కస్టడీకి పేపర్ లీక్ నిందితులు.. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు

ఈడీ కస్టడీకి పేపర్ లీక్ నిందితులు.. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. పేపర్ లీక్ లో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను కోర్ట్ ఈడీ కస్టడీకి నాంపల్లీ కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైల్లో వీళ్లిద్దరిని ప్రశ్నించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిందితులను చంచల్ గూడ జైలులో ఈడీ విచారించనుంది.

ఇప్పటికే పేపర్‌ లీక్‌ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. మనీలాండరింగ్ ఆరోపణలపై టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ నిందితులను ఈడీ విచారిస్తోంది.