
ఈడీ ఆఫీసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో.. సౌత్ గ్రూప్ పాత్ర ఏంటీ.. ఆ లావాదేవీలు ఎలా జరిగాయి.. ఎవరెవరు ఆ డబ్బులను సమకూర్చారు.. సౌత్ గ్రూపులో మీ పాత్ర ఏంటీ అంటూ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ఆప్ లీడర్ మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్లయ్ ఇచ్చిన సమాచారంతోపాటు రిమాండ్ రిపోర్టులో వాళ్లిద్దరూ చెప్పిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. పిళ్లయ్ తో కలిపి కవితను.. ఫేస్ టూ ఫేస్ విచారిస్తున్నారు. ఆప్ పార్టీకి ఇచ్చిన డబ్బు విషయంలోనే ప్రధానంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ స్టేట్ మెంట్స్, ఇతర డాక్యుమెంట్లపై ఆరాతీస్తున్నారు. మరో వైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది.