చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు

చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌ : క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఈడీ అధికారులు ఐఎస్‌ సదన్‌లోని చికోటి ప్రవీణ్‌ నివాసం, బోయిన్ పల్లిలోని మాధవ రెడ్డి నివాసంలో బుధవారం ఉదయం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్లతో పాటు పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్కు సంబంధాలున్నట్లు గుర్తించారు.

ఈడీ సమన్లపై చికోటి ప్రవీణ్ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తోందని స్పష్టం చేశారు. గోవాలో క్యాసినో లీగల్ అని, నేపాల్ లో చట్టబద్దమన్న ప్రవీణ్.. ఈడీ ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. ఈడీ ఏ వివరాలు అడిగినా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్న ప్రవీణ్ సోమవారం ఈడీ ఎదుట హాజరవుతానని చెప్పారు. 

ఈడీ విచారణలో నేపాల్ క్యాసినో ఈవెంట్ లో టాలీవుడ్, బాలీవుడ్ కుచెందిన 10 మంది ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వారితోనే ప్రమోషన్ వీడియోలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలతో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.