సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ డైరెక్టర్ అభిషేక్​కు ఈడీ సమన్లు

సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ డైరెక్టర్ అభిషేక్​కు ఈడీ సమన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సెవెన్‌‌‌‌ హిల్స్‌‌‌‌ మాణిక్‌‌‌‌ చంద్‌‌‌‌ ప్రొడక్ట్స్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని ఆఫీస్‌‌‌‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్‌‌‌‌ కింద నమోదైన ఈసీఐఆర్ 48/22 కేసులో విచారణకు హాజరు కావాలని హైదరాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌ గోయల్‌‌‌‌ నోటీసుల్లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ తీసుకురావాలని సూచించారు. 2015 నుంచి  బ్యాంక్‌‌‌‌ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌‌‌ తీసుకురావాలని చెప్పారు. 

ఫాంహౌస్ కేసు నిందితుడు నందకుమార్ పై గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో అభిషేక్ ఆవల ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడి మధ్య 7కోట్ల 50లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దానిలో భాగంగానే అభిషేక్ ఆవలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.