
న్యూఢిల్లీ: ఎయిర్ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించిన డీల్విచారణలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కు ఎన్ ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు పంపింది. విచారణ కోసం ఈ నెల 23న హాజరుకావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సివిల్ఏవియేషన్మాజీ మంత్రి ప్రఫుల్పటేల్ను ఈడీ విచారించింది. అప్పట్లో చిదంబరం ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపాకే కొనుగోలు జరిగిందని ప్రఫుల్వెల్లడించినట్లు సమాచారం. విమానాల కొనుగోలు, ఎయిర్ఇండియాలో ఇండియన్ ఎయిర్లైన్స్విలీనం.. ఈ రెండు నిర్ణయాలకూ కేబినెట్ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో చిదంబరంను విచారించేందుకు ఈడీ సమన్లు పంపించింది. 2007లో అప్పటి యూపీఏ సర్కారు ఎయిర్ఇండియా కోసం 70 వేల కోట్లు ఖర్చుపెట్టి 111 విమానాలను కొంది. ఇందులో 43 విమానాలను ఎయిర్బస్నుంచి, 68 విమానాలను బోయింగ్కంపెనీ నుంచి ఖరీదు చేసింది. ఈ డీల్లో భారీ కుంభకోణం జరిగిందని, ఆ తర్వాతే ఎయిర్ఇండియా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఫ్రాఫిటబుల్రూట్లను విదేశీ ఎయిర్లైన్స్కంపెనీలకు అప్పజెప్పారన్న ఆరోపణలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో కార్పొరేట్లాబీయిస్ట్దీపక్తల్వార్ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.