ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు మళ్లీ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు మళ్లీ నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గత నెల 2న ఈడీ నోటీసులు జారీ చేయగా, ఈ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. దీంతో సోమవారం మరోసారి ఈడీ నోటీసులిచ్చింది. 

లిక్కర్ స్కాంలో తొలి సారి ఈ ఏడాది ఏప్రిల్ 16 న సీబీఐ అధికా రులు కేజ్రీవాల్ ను విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు సీబీఐ అధికారులు నన్ను విచారించారు. వారు అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. లిక్కర్ స్కాం రాజకీయ కుట్ర. ఆప్ ని అంతం చేయాలనుకుంటున్నారు. కానీ దేశ ప్రజలు నాతో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే,  ఈ నెల 18 సోమవారం నుంచి ఈ నెల 30 దాకా విపస్సన మెడిటేషన్ కోర్స్ కు వెళ్లేందుకు సీఎం కేజ్రీవాల్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సందర్భంలో ఆయనకు ఈడీ నోటీసులు పంపడం గమనార్హం.