
ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ ఎగిసిపడుతూ దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆలయాన్ని అధికారులు మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. - పాపన్నపేట, వెలుగు