రెబల్ ఎమ్మెల్యేల సంబరాలు

రెబల్ ఎమ్మెల్యేల సంబరాలు

మహారాష్ట్ర నెక్ట్స్ సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన పేరును ఫడ్నవీస్ ప్రకటించగానే.. రెబల్ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. గోవాలోని ఓ హోటల్ లో రెబల్ ఎమ్మెల్యే వర్గం బస చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండేలు గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. రెబల్ ఎమ్మెల్యేలు టీవీల ముందు అతుక్కపోయారు. సీఎంగా ప్రమాణం చేసేది ఏక్ నాథ్ షిండే అని ప్రకటించడంతో సంతోషంతో చిందులు వేశారు. సంబరాలు చేసుకున్నారు. 

ట్విస్టుల మీద ట్విస్టులతో హీటెక్కిన మరాఠ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. ఫడ్నవీస్ సీఎంగా ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని చివరి వరకు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ప్రెస్ మీట్ లో ఫడ్నవీస్ ఇచ్చిన స్టేట్ మెంట్ అందరినీ షాక్ గురి చేసింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతుందని.. సీఎంగా షిండే ప్రమాణస్వీకారం చేయబోతున్నారని చెప్పారు ఫడ్నవీస్. ఉద్దవ్ సర్కార్ ను కూల్చారనే అపవాదు రాకుండా బీజేపీ జాగ్రత్త పడుతునట్లు స్పష్టంగా  అర్థమవుతోంది. అందులో భాగంగానే తమకు 106 సీట్లున్నా.. 40మంది ఎమ్మెల్యేలతో ఉన్న షిండేకు సీఎం పదవి అప్పగించేందుకు రెడీ అయింది. ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతు ఇస్తామని చెప్పారు ఫడ్నవిస్. ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనన్నారు.