న్యూఢిల్లీ, వెలుగు : కరీంగనర్ కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకుడు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. 2023 ఏడాదికి గాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, నెపాలీ, ఉర్దూ, ఒడిశా తదితర భాషల్లో తర్జుమాలకు గాను 24 మంది అనువాదకులకు సోమవారం సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది. ఇందులో ఇంగ్లిష్ లో పవన్ కె వర్మ రచించిన ‘గాలిబ్: ది మ్యాన్’ పుస్తకాన్ని ‘గాలిబ్ నాటి కాలం’ పేరుతో ఎలనాగ.. తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేశారు. ఈ పుస్తకం అనువాద విభాగంలో అవార్డుకు ఎంపికైంది.
