
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇండియా స్టార్ షూటర్ ఇలవెనిల్ వలారివన్ కాంస్య పతకం గెలిచింది. మంగళవారం జరిగిన విమెన్స్10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చాలా సమయం పాటు ఆధిక్యంలో నిలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన 25 ఏళ్ల ఇలవెనిల్ 231.2 పాయింట్లతో కాంస్యం అందుకుంది. చైనా షూటర్ వాంగ్ జిఫై (252.7 పాయింట్లు) స్వర్ణం, కొరియా షూటర్ క్వాన్ యుంజీ (252.6 పాయింట్లు) రజతం నెగ్గారు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న అనన్య నాయుడు, రమిత జిందాల్, మేఘన సజ్జనార్ ఆర్య బోర్సే క్వాలిఫికేషన్ రౌండ్‌లో వెనుదిరిగారు.