మిర్యాలగూడలో ధన బలానికి ప్రజా బలానికి మధ్య పోటీ: సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడలో ధన బలానికి ప్రజా బలానికి మధ్య పోటీ: సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడలో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  మిర్యాలగూడలో ధన బలానికి ప్రజా బలానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు.  తన హయాంలోనే పట్టణం అభివృద్ది జరిగిందన్నారు.  ప్రతి గ్రామంలో సీపీఎం పార్టీకి  ప్రజలు నీరాజనాలు పడుతున్నారని  మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు.  చట్ట సభల్లో ప్రజా గొంతుకను వినిపించడానికి  సీపీఎం అభ్యర్ధి ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు,  మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను ఉపయోగించుకొని ... ఆ తరువాత బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు,  

మునుగోడు ఎన్నికలలో BRS కమ్యూనిస్ట్ లను ఉపయోగించుకుని తర్వాత బిజేపి తో కలిశారు.  పొత్తు వ్యవహారంలో కాంగ్రెస్ మాట తప్పినా ప్రజా మద్దతు తమకే ఉందన్నారు.రెండు పర్యాయాలు గా గెలిచిన భాస్కర్ రావు ... నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది చేయలేదన్నారు.బీఆర్ ఎస్ పార్టీ సేవా కార్యక్రమాల ముసుగులో ఎమ్మెల్యే గా గెలిచి మిర్యాలగూడ ను దోచుకోవాలని చూస్తున్నారన్నారు.