రైతుల గోస ఎన్నడైనా పట్టించుకున్నారా? : సి.లక్ష్మారెడ్డి

రైతుల గోస ఎన్నడైనా పట్టించుకున్నారా? : సి.లక్ష్మారెడ్డి
  • జడ్చర్ల బీఆర్​ఎస్​ అభ్యర్థి సి.లక్ష్మారెడ్డి

బాలానగర్, వెలుగు : 'గత ప్రభుత్వాలు 70 ఏండ్లు పాలించాయి. ఎన్నడైనా తాగునీరు అందించాయా?  రైతుల గోసను ఎన్నడైనా పట్టించుకున్నాయా? కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లు వస్తాయి' అని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి అన్నారు. రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి, బీబీనగర్, నాన్ చెరువుతండా గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సీఎం కేసీఆర్​ హ్యాట్రిక్​ సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్​ తొమ్మిదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు మీ కళ్ల ముందరే ఉన్నాయన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లను  కోరారు.  తనను మరోసారి గెలిపించాలని కోరారు.