ఎన్నికల పోలింగ్ సమయం 11 గంటలు.. ఇండియాలోనే ఫస్ట్ టైం

ఎన్నికల పోలింగ్ సమయం 11 గంటలు.. ఇండియాలోనే ఫస్ట్ టైం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  రాజస్థాన్‌లో పోలింగ్‌ సమయాన్ని  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించింది. అంటే  11 గంటలన్న మాట. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు  ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయాన్ని ఇంత పెంచడం ఇండియాలోనే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. 2013,  2018  రాజస్థాన్‌లో  జరిగిన ఎన్నికలకు పోలింగ్‌ సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. 

Also Read : 9 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు : మంత్రి కేటీఆర్

రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 51వేల 756 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్‌లో గరిష్టంగా 1,450 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్‌కు పట్టే సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఈసారి ఓటింగ్ సమయాన్ని పెంచింది.  కాగా 2023 నవంబర్ 25న  రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.  డిసెంబర్  3 న ఫలితాలు వెలువడనున్నాయి.