ఆగస్టు 20న వరంగల్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఎన్నిక

ఆగస్టు 20న  వరంగల్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఎన్నిక

హనుమకొండ సిటీ, వెలుగు: ఈ నెల 20న టీజీఎన్​పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి వరంగల్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ఎన్నిక నిర్వహించనున్నట్లు కౌన్సిల్ చైర్మన్, హనుమకొండ ఎస్ఈ కె.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటుకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న సాయంత్రం 5 గంటలలోగా ఉమ్మడి వరంగల్ సర్కిల్ కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ ఫైనల్ చేస్తామన్నారు. 

12 నుంచి 14వ తేదీ వరకు వరంగల్ సర్కిల్ డీఈఈ ఛాంబర్ లో స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యత్వానికి ఆసక్తి సర్కిల్ ఉద్యోగ క్రీడాకారులు నామినేషన్  దాఖలు చేయొచ్చన్నారు. 16న నామపత్రాల పరిశీలన, అదేరోజు సాయంత్రం ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చేస్తారన్నారు. 17న నామినేషన్ ఉపసంహరన, 20న ఉమ్మడి వరంగల్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుల ఎంపిక కోసం హనుమకొండలోని స్పోర్ట్స్ హాల్లో ఓటింగ్ ఉంటుందని, సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారని ఎస్ఈ వెంకటరమణ వివరించారు.