సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లను గుర్తించాలి : వసంతకుమార్

సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లను గుర్తించాలి : వసంతకుమార్

గద్వాల, వెలుగు: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని టీమ్స్​ పక్కాగా పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు వసంతకుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో సీ విజిల్, కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ, మీడియా సెంటర్ ను పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్  వల్లూరు క్రాంతి ఆయనకు వివరించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్  కేంద్రాలను  గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. 

సీ విజిల్  యాప్  ద్వారా ఇప్పటి వరకు సీ విజిల్​కు 58 , టోల్ ఫ్రీ నెంబర్ కు 796 కాల్స్  వచ్చాయని, వాటిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పరిశీలకుడు మాట్లాడుతూ ఎన్నికలను ప్రభావిత చేసే అంశం ఏదైనా ప్రజల దృష్టికి, పార్టీ నాయకుల దృష్టికి వస్తే తన మొబైల్  నెంబర్ 6300332716 కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుపై  నేరుగా తనని జెన్ కో గెస్ట్  హౌస్, జూరాలలో సంప్రదించవచ్చని చెప్పారు. 

ALSO READ : కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదు : సంజయ్ కుమార్

అలంపూర్  నియోజకవర్గం వారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, గద్వాల నియోజకవర్గం వారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏవో భద్రప్ప, ఎంసీఎంసీ నోడల్  ఆఫీసర్  చెన్నమ్మ, సి విజిల్  యాప్  నోడల్​ ఆఫీసర్​ ప్రియాంక ఉన్నారు.